Wednesday, August 15

విరక్తి రాగంలో విముక్తి గీతం

I know, it is a rehash. But it is frightening how things change and remain the same too. This poem was written in the eighties and still reads true.

కవి సమ్మేళనాల కోసం వ్రాసే కవితలు కొంచెం తేలిక గానే వుంటాయి; పైకి చదివేటపుడు, అదిన్నూ సభల్లో, కవిత మరీ హ్రస్వంగా వుండకూడదు, క్లిష్టంగానూ వుండకూడదు. At least, that is what I learnt in my few forays into poetry reading in public. చదువుకునే కవిత్వానికీ వినే కవితలకీ బోలెడంత దూరం గాబట్టి. ఆపాతమధురం ఆలోచనామృతం వేరు కాబట్టి. నేనూ Fifteenth August పజ్యాలు పుణ్యం కట్టుకున్నాను. ఇదిగో ఇలా:

గుండెలు చీల్చుకుని వస్తోందీ ఆక్రోశం
ఏమైపోతోంది నా దేశం?

త్యాగధనులూ ధర్మపురుషులు
అసంఖ్యాక కర్మయోగులు
ఆశాస్థికల చుట్టూ పోషించిన నా దేశం
నిస్స్వార్థత నిజాయితీ నిత్యం లోకకల్యాణం
ఆశయాల పునాదుల పై నిర్మించిన నా దేశం

అందరూ సుఖపడాలనీ
సంపదలు పంచుకోవాలనీ
సౌహార్ద్రత పెంచుకోవాలనీ
ప్రజానాయకులు చెర విడిపించిన పసిపాప
పుట్టినదాదిగా దిన దిన గండం
చుట్టూ శత్రువులూ యింట్లోనే కుట్రదారులూ
ఏ కొంచెం ప్రేమా భక్తీ త్యాగం సేవానిరతీ
కోటికొక్కరు చూపినా అదే పదివేలని మురిసిపోతూ
దిగులుచీకటిని చీల్చుకుని హర్షసూర్యోదయం
జరుగుతుందని భ్రమసిపోతూ
భయం భయంగా బెదురు బెదురుగా
నడివయస్కురాలయిపోయిన నా దేశం

ఏమైపోతోంది నా దేశం?
లేదా శాంతిభద్రతలకు ప్రవేశం?

ఉత్సాహం ఉరకలు వేసే కళ్ళలో
బంగారు కలలు నించుకొని
దేశం మీదే ప్రాణాలన్నీ వుంచుకొని
భావిలో ఎపుడో శాంతి పూలు విరుస్తాయనీ
స్నేహజలాలు హృదయక్షేత్రాలని
ఆనందనవనాలు చేస్తాయనీ
దేశంలో సామాన్యుని గుండెల్లో
స్వేచ్ఛావాయువులు వీస్తాయనీ
ఎదురుచూసి పాటుపడి
ప్రాణలు సైతం ఒగ్గిన
ఆ వీరుల నీడలనే మ్రింగేసిన చీకటి

నా దేశంలో సగటు మానవుడి సగం దేహం నగ్నం
నిండిన కడుపు అతనికి దివాస్వప్నం
కప్పు కురియని యిల్లూ అప్పు చేయని నెలా అతనికి గగనసుమాలు
కరువూ నల్ల బజారూ ధరలూ మోసాలూ
అతనికి సుపరిచితాలు
నిద్రలో కూడా అతనికి రిట్రెంచ్మెంట్ పీడకలలు
తృప్తీ విశ్రాంతీ అరనిముషం విరామం అసంభవం

నా దేశంలో సగటు మానవుడు బడుగు
ఎక్కడ వేశాం మనం తప్పటడుగు?
గుండెలు చీల్చుకొని వస్తోందీ ఆక్రోశం
లేదా సుఖశాంతులు గల ప్రదేశం?

నడుము కట్టి బాగుచేసి బాగుపడాల్సిన
యువత మేధావర్గం
గంజాయికలల కౌగిలిలో
కలవాళ్ళేమో కలర్ టివి సెట్లకోసం
మధ్య తరగతి మనుగడ త్రిశంకు స్వర్గం
దుండగులూ, దోపిడీదారులు
సుఖవ్యాధులూ దౌర్జన్యాలు
కట్నం చావులూ మతకలహాలు.

లేడా మన వెర్రిగొర్ర్రె జనతకి కాపరి?
ఏమైపోయాయి దీక్షా కార్యాచరణ?
ఏమైపోయాయి నిజాయితీ నిష్కపటం?
గుండెలు చీల్చుకొని వస్తోందీ ఆక్రోశం
ఏమైపోతోంది నా దేశం?

కానీ, చావుకి పెడితేనే లంఖణాలకి
వేకువ జాముకి మునుపే చీకటి చిక్కన

త్వరలోనే క్రాంతీ శాంతీ వెల్లి విరుస్తాయనీ
మనలోనే నూతనోత్తేజం పుట్టుకొస్తుందనీ
ఆశాభావంతో దీక్షాగీతం
పాడుతూనే వుంటుంది హృదయం

నిత్యకల్యాణంగా ఉద్భవించి తీరుతుందొక ఉదయం
దేశభక్తీ త్యాగనిరతి
నిజాయితీ కార్యదీక్ష
నిఘంటువుల్లోనే నిలిచిపోవు

స్వాతంత్ర్యం ఒక పారిజాతం
నా దెశం పవిత్ర దేవళం
సంపదలు సరిసమానం
సౌఖ్యం పుష్పక విమానం
ఆ రోజు వస్తుంది తప్పక
త్వరలోనే, త్వరలోనే

అపుడు ఆందోళన ఆర్తి మిగలవు లవలేశం
ప్రేమసీమ రామ రాజ్యం భూతల స్వర్గం నా దేశం.

Thus we welcome old age, folks.Thank you for bearing with me.

Thursday, August 9

Love in a rocking chair

I sit here in my rocking chair
And remember the times
When my arms clasped you close
Body straining against body

I sit here rocking

Through thick and thin
In sickness and health
In fascination need and longing
I remember clawing

I sit here rocking

All the nights of tangled limbs
Hesitant caresses urgent hands
Your skin silk in moonlight
My legs wrapped around you

I sit here rocking

Toothless we are and wrinkled
Aches and pains and aging
But it was only yesterday
Those nights of unbridled lust

I sit here rocking
 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.