Friday, November 9

To whom it may concern

I have been neglecting this blog, I know. I am seriously considering shutting it down, really. But before I do that, here is one more:

కోపం లేదు నాకు నిరాశే గాని

నమ్మిన ఎదలో ముళ్ళు చల్లి
ప్రేమపూలేరుకుని వెళ్ళిపోయావని

ఎన్నాళ్ళు నీ కోసం ఎదురు చూసాను

హఠాత్తుగా కనబడి
గుండెల్లో అలజడి
సద్దుకోక మునుపే
నేనెన్నాళ్ళో కూడబలుక్కున్న
స్వాగతవచనాలు వినక మునుపే
సెలవని వెళ్ళిపోయావని

నిరీక్షణ అంతమయి
అనంతమైన విరహం మొదలయి
కుమిలే నా కోర్కెల నూరడించే
ఒక్క జ్ఞాపకమైనా
వదలకుండానే వెళ్ళిపోయావని

కోపం లేదు నాకు నిరాశే గాని

Cheers!

Wednesday, August 15

విరక్తి రాగంలో విముక్తి గీతం

I know, it is a rehash. But it is frightening how things change and remain the same too. This poem was written in the eighties and still reads true.

కవి సమ్మేళనాల కోసం వ్రాసే కవితలు కొంచెం తేలిక గానే వుంటాయి; పైకి చదివేటపుడు, అదిన్నూ సభల్లో, కవిత మరీ హ్రస్వంగా వుండకూడదు, క్లిష్టంగానూ వుండకూడదు. At least, that is what I learnt in my few forays into poetry reading in public. చదువుకునే కవిత్వానికీ వినే కవితలకీ బోలెడంత దూరం గాబట్టి. ఆపాతమధురం ఆలోచనామృతం వేరు కాబట్టి. నేనూ Fifteenth August పజ్యాలు పుణ్యం కట్టుకున్నాను. ఇదిగో ఇలా:

గుండెలు చీల్చుకుని వస్తోందీ ఆక్రోశం
ఏమైపోతోంది నా దేశం?

త్యాగధనులూ ధర్మపురుషులు
అసంఖ్యాక కర్మయోగులు
ఆశాస్థికల చుట్టూ పోషించిన నా దేశం
నిస్స్వార్థత నిజాయితీ నిత్యం లోకకల్యాణం
ఆశయాల పునాదుల పై నిర్మించిన నా దేశం

అందరూ సుఖపడాలనీ
సంపదలు పంచుకోవాలనీ
సౌహార్ద్రత పెంచుకోవాలనీ
ప్రజానాయకులు చెర విడిపించిన పసిపాప
పుట్టినదాదిగా దిన దిన గండం
చుట్టూ శత్రువులూ యింట్లోనే కుట్రదారులూ
ఏ కొంచెం ప్రేమా భక్తీ త్యాగం సేవానిరతీ
కోటికొక్కరు చూపినా అదే పదివేలని మురిసిపోతూ
దిగులుచీకటిని చీల్చుకుని హర్షసూర్యోదయం
జరుగుతుందని భ్రమసిపోతూ
భయం భయంగా బెదురు బెదురుగా
నడివయస్కురాలయిపోయిన నా దేశం

ఏమైపోతోంది నా దేశం?
లేదా శాంతిభద్రతలకు ప్రవేశం?

ఉత్సాహం ఉరకలు వేసే కళ్ళలో
బంగారు కలలు నించుకొని
దేశం మీదే ప్రాణాలన్నీ వుంచుకొని
భావిలో ఎపుడో శాంతి పూలు విరుస్తాయనీ
స్నేహజలాలు హృదయక్షేత్రాలని
ఆనందనవనాలు చేస్తాయనీ
దేశంలో సామాన్యుని గుండెల్లో
స్వేచ్ఛావాయువులు వీస్తాయనీ
ఎదురుచూసి పాటుపడి
ప్రాణలు సైతం ఒగ్గిన
ఆ వీరుల నీడలనే మ్రింగేసిన చీకటి

నా దేశంలో సగటు మానవుడి సగం దేహం నగ్నం
నిండిన కడుపు అతనికి దివాస్వప్నం
కప్పు కురియని యిల్లూ అప్పు చేయని నెలా అతనికి గగనసుమాలు
కరువూ నల్ల బజారూ ధరలూ మోసాలూ
అతనికి సుపరిచితాలు
నిద్రలో కూడా అతనికి రిట్రెంచ్మెంట్ పీడకలలు
తృప్తీ విశ్రాంతీ అరనిముషం విరామం అసంభవం

నా దేశంలో సగటు మానవుడు బడుగు
ఎక్కడ వేశాం మనం తప్పటడుగు?
గుండెలు చీల్చుకొని వస్తోందీ ఆక్రోశం
లేదా సుఖశాంతులు గల ప్రదేశం?

నడుము కట్టి బాగుచేసి బాగుపడాల్సిన
యువత మేధావర్గం
గంజాయికలల కౌగిలిలో
కలవాళ్ళేమో కలర్ టివి సెట్లకోసం
మధ్య తరగతి మనుగడ త్రిశంకు స్వర్గం
దుండగులూ, దోపిడీదారులు
సుఖవ్యాధులూ దౌర్జన్యాలు
కట్నం చావులూ మతకలహాలు.

లేడా మన వెర్రిగొర్ర్రె జనతకి కాపరి?
ఏమైపోయాయి దీక్షా కార్యాచరణ?
ఏమైపోయాయి నిజాయితీ నిష్కపటం?
గుండెలు చీల్చుకొని వస్తోందీ ఆక్రోశం
ఏమైపోతోంది నా దేశం?

కానీ, చావుకి పెడితేనే లంఖణాలకి
వేకువ జాముకి మునుపే చీకటి చిక్కన

త్వరలోనే క్రాంతీ శాంతీ వెల్లి విరుస్తాయనీ
మనలోనే నూతనోత్తేజం పుట్టుకొస్తుందనీ
ఆశాభావంతో దీక్షాగీతం
పాడుతూనే వుంటుంది హృదయం

నిత్యకల్యాణంగా ఉద్భవించి తీరుతుందొక ఉదయం
దేశభక్తీ త్యాగనిరతి
నిజాయితీ కార్యదీక్ష
నిఘంటువుల్లోనే నిలిచిపోవు

స్వాతంత్ర్యం ఒక పారిజాతం
నా దెశం పవిత్ర దేవళం
సంపదలు సరిసమానం
సౌఖ్యం పుష్పక విమానం
ఆ రోజు వస్తుంది తప్పక
త్వరలోనే, త్వరలోనే

అపుడు ఆందోళన ఆర్తి మిగలవు లవలేశం
ప్రేమసీమ రామ రాజ్యం భూతల స్వర్గం నా దేశం.

Thus we welcome old age, folks.Thank you for bearing with me.

Thursday, August 9

Love in a rocking chair

I sit here in my rocking chair
And remember the times
When my arms clasped you close
Body straining against body

I sit here rocking

Through thick and thin
In sickness and health
In fascination need and longing
I remember clawing

I sit here rocking

All the nights of tangled limbs
Hesitant caresses urgent hands
Your skin silk in moonlight
My legs wrapped around you

I sit here rocking

Toothless we are and wrinkled
Aches and pains and aging
But it was only yesterday
Those nights of unbridled lust

I sit here rocking

Sunday, July 29

Of definitions

అస్తిత్వం కోల్పోయి అనిర్వచనీయమైన
అందీ అందని అంచున వేలాడేటపుడు
నీవెక్కడో తెలుసా, నీవెవరో తెలుసా?

బుసకొట్టే నిట్టూర్పుల్లో గుసగుసలాడే ఆజ్ఞల్లో
మెట్లెక్కే దైహికానుభూతి పర్వతారోహణ అందామా?
ప్రాణి ప్రాణిని పూజించే తరుణాన్ని విపులీకరించమంటావు, ఎలా?

పలుకు మూగవోయి ఎడద నిండిపోయి
చెమట తొలకరి పంటకొచ్చే క్షేత్రం గాత్రమైనపుడు
వేదపాఠాల గాంభీర్యం స్వేదవర్షాల సన్నివేశాల కబ్బినపుడు
మెలివడిన వ్రేళ్లకి హోమాగ్నికీలలు పరమయినపుడు
అష్టోత్తరశతంగా దేహార్చనలో ముద్దులు నిండినపుడు
కోవెల గంటల ప్రతిధ్వని గుండె సవ్వడి కాదేశమైనపుడు

ఇది పూజ కాదా?
పరమార్ధమేమిటి?
ఒక చిరుమరణం

Saturday, July 14

Happy birthday, nephew

The Jesus year, I think of it, being thirty-three. Say hi to your mother, sister and aunts. My love to the kids and all that. I wrote this poem way back in 1992, for Mummy. I am sure you recall the circumstances. But it holds true for all of us, so I dedicate it to the 1 SPM Street brigade and culture. A poem for you, Seenu. I called it Menopause Blues, before I knew what they are like, ha!

మనసుతో చదివే ముఖాలలో
ఎంత నవ్వితే చేరతాయి కళ్లకి కాకపాదాలు
ఎంత జీవిస్తే వస్తాయి పెదవుల పక్క గీతలు
ఎన్ని అనుభవాల యుగాల తర్వాత లేచాయి
నీ ముఖచిత్రంలో ముడతల కొండలు
ఎన్ని ఊహాజీవితకాలాల వయస్సు నీ
కళ్ల క్రింద ఎండిన లోయలకి
నీడల ముఖాలలో చిక్కనయే చీకటికి
ఎన్ని ఎండల బాటలు నడవాలి?

బిగపట్టిన కండరాల ప్రకంపనలు లేకుండానే
కన్నులు వర్షించాక పెదవి వంపు హరివిల్లవకుండానే
బ్రతకకుండానే జీవించిన ముఖాలేవీ?

అంతర్మధనంలో అలిసిన అస్తిత్వాన్నీ
జీవితం ప్రతి కోణాన్నీ
ప్రతిబింబించే వదనాలలో
ముడతలుండవూ మరి?
నవ్వులకే పరిమితమా జీవితం?

కాలెండరు కాగితాలు చదవకు
ముఖాలు చెప్పే జీవితకథలు చదువు

చదువు అద్దంలో నీ కళ్ల పక్కనున్న గీతలకి అర్థాన్ని
చదువు నోటి పక్కని చిరుగీతల చరిత్ర
పునరావలోకనంలో తెలీదూ
నువ్వూ మనిషివేనని?

బ్రతికిన జీవితం అర్థం మారుతుందా మేకప్ ముసుగు వల్ల
మస్కారా ఐషాడోలతో మెరుస్తాయా నీ కళ్లు సెన్సాఫ్ హ్యూమరు లేకుండా

ఒక్కో అనుభవమూ మనిషిగా నిన్ను హెచ్చించి
ఒక్కో గుణపాఠమూ మానవత్వాన్ని గుణించి
విషాదాన్ని తీసివేసి నవ్వులని కూడడం
నువ్వు నేర్చుకునుంటే ముసుగెందుకు వేసుకుంటావు?

సగర్వంగా నుంచో ముడతల ముఖంతో
నిర్భీతిగా నుంచో నెరుస్తున్న తలతో

Monday, July 9

I accuse

You know, I keep doing revisions. Sometimes they work, sometimes they don't. Here I am, posting for the sake of a comma and further thought. Be that as it may, and since I won't do a Telugu version, here is a poem about little people caught up in large events. I changed a few words too, so sue me.

They held me, like they beheld his chariot,
In awe.
The other charioteers did, until now.

If in the blood and gore
And slippery mess of battleground
The wheels suddenly did touch the earth,
Who would notice?

Not the cheering army of the five brothers;
Not the thunderstruck troops of the Kauravas.
Not Drona who was grieving,
Renouncing and dying;
Not the ungallant brother-in-law of my lord
Who was fulfilling his destiny.

Not his brothers who in battle lust were immersed.
Not the beloved Madhyama,
Bhima, whose deed my lord gave voice to,
He was grieving for his son;
Not Arjuna, following your divine lead
And chasing the self-accursed ones,
He was grieving for his son, too.
Not Nakula, the graceful one;
Not Sahadeva, the wise.

When the chariot stopped floating
Serenely superior
And landed abruptly,
Krishna, what must my lord have felt?
A lie however couched,
Asvatthama hatah; kunjarah.

You made him atone
For his brothers' sacrifices,
You made him tell a lie.

Did you have to bring even my lord
Down to a mere mortal, Krishna?
Did you have to prove that humanity is weak,
The right lever one can move worlds,
Make a truthful man a liar?

Not a born enemy my lord had,
Until you turned Asvatthama
A dark angel of destruction with this lie.
Not a fault my lord had.
One lie and the next will come easier,
The third will trip off the tongue.

My lord's chariot became ordinary, Krishna.
There must be a better way to serve Dharma.

Until next time then.

Thursday, July 5

Home truths 1982

అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగ నగు.
తెలుగులో ఏడిస్తే యింకో భాషలోనూ ఏడవడం కుదురుతుంది. అభ్యాసం కూసు విద్య అన్నారు మరి.
ఆంచేత,
tears are invisible in the dark
sobs go unheard in silences of night
no eyes to see
no ears to hear

your solitude
your alienation
will never desert you

dark dimple in a flood of light
unused note in the symphony of world
not jasmine but discarded stem
as attractive as a sixth finger
and as necessary

your solitude
your alienation
will never desert you.

Till we meet again, people.

Saturday, June 23

మరువకూడని నిజాలు

Okay, I admit I have been neglecting this blog. And now I have the guilty conscience of not mentioning names when I wrote about reading Indian writers, and worse.

So, here is a poem. The idea is one thing, but the refrain is another. That was inspired by a song. Yeah, my father's lyric, so sue me. That song was sung by Balamuralikrishna, and Pendyala set a brilliant score. A search for the song shocked me. How can lyricists and poets who have a distinctive style be mistaken one for the other? It baffled me and bothered me. Kosaraju was a grand lyricist, but he never wrote this song. Arudra did.

Be that as it may, the words are what kill me softly, each time I hear the song.


మరువకూడని నిజాలు

చీకట్లో కన్నీళ్లు కనిపించవు
నిశ్శబ్దంలోనూ నీ వెక్కిళ్లు వినిపించవు
చూసే కళ్లు లేకపోతే
వినే చెవులు లేవు గనక

రాత్రంతా నీ కళ్లు వరద గోదారులయినా
పట్టించుకునే హృదయం లేదు
నీ ఏకాంతం నీ పరదేశీతనం
నిన్ను విడిచి పోవు.

వెలుతురు వరదలో చీకటి తరగవి
ప్రపంచగీతంలో పలకని పంచమివి
గిల్లివేసిన మల్లెపూ తొడిమెవి
అనాకర్షణీయమైన దానివి
ఆరో వేలులాంటి దానివి
అక్కర్లేని దానివి

నీ ఏకాంతం నీ పరదేశీతనం
ఎన్నటికీ ఎప్పటికీ
నిన్ను విడిచి పోవు.

మళ్ళీ కలుద్దాం,
Till later, people.

Wednesday, June 13

జాగారం

నక్షత్రాలని ప్రవేశపెట్టే
నల్లదనం యింకా అలుముకోని వేళ
మారుమూల పల్లెల్లో గోధూళి వేళ
మహాపట్టణాలలో వాతావరణ కాలుష్యం వేళ
గాలికి వాలే రెల్లుగడ్డి వేళ

బాధలో
వేచి వుండు
లేచివుండు

చంద్రవంక ఒక చన్ను మాత్రం
రేఖామాత్రంగా కనబడే అమ్మాయి
అశరీరి
అనామిక
కనబడని రహస్య తారక
ఆమె నాభి

వేచి వుండు
లేచి వుండు
ఆమె జీవితకాలసూత్రం జారుతుంది

వేకువ చుక్క వెలిగే ముందు
వెలిసే చీకటి వేళ
ఎక్కడో పిట్టల వేళ
ఇక్కడ కాకుల వేళ

ఎంత క్షణికం!
వేదనావాహిని
ఎంత నిరంతరం!
వేచి వున్నావు కదూ?


ఉమాశంకర్ కి అనువాదం

మళ్లీ కలుద్దాం.
Later, people.

Friday, June 8

శృతి తప్పిన గీతిక

Hello again people.

I've rather neglected my poetry blog, I know. I am fobbing you off with another recycled poem again. But I am working on a few haiku and tanka offerings, I promise. (as if I have hordes of readers panting for any, but still.)

This is an old poem, published way back in '87, but it was appreciated by senior poets. You know you have made an impression when people who bother about poetry dissect a poem on offer and write about nuances.

ఈ విరిగిన వీణని మీటుతున్నారెవరో
ఎంత వికృతంగా వుందీ ధ్వని?

భూమ్మీదిపుడే పడిన పసికందు రోదనవలె
ప్రమాదంలో చావనోచుకోని దౌర్భాగ్యుని మూల్గులవలె
ఎటనుంచో తేలివచ్చు ఎన్నికల వాగ్దానాల వలె
పరిచిత స్వరాలపరిచిత స్వనములలో నేర్చుకోని పాట లాగు
మరిచిపోని ములుకు లాటి హితుల చేదు మాట లాగు

ఈ విరిగిన వీణ నుండి రాబట్టే ధ్వని
ఎంత వికృతంగా వుంది!

ఊళ్ళని ముంచేసిన ఉప్పెన హోరులాగు
జనతాకాశంలో ఏకాకి గాలిపడగలాగు
నిదురెరుగని నిర్విరామ నీరధి ఘోషం వలె
రాత్రి వీధుల్లో వెర్రిమెదడు విహారంవలె

ఎన్ని విషాద పదార్థాల కలయిక
ఎంత వికృతంగా వుందీ ధ్వని!

ఓపలేని ఆపరాని అనంత విలయగీతం
ఈ విరిగిన వీణనుండి ఎందుకిలా వెలువడుతోంది?
చేతులు తాకని తీవెలు తమంతతామె మ్రోగి
వేళ్ళు నొక్కిపెట్టని మెట్ల ప్రళయ రాగాలు సాగి

విలపించే గుండెపంచ ప్రతి స్వరం చిత్రహింస
ఎంత కాలం నుండి వింటున్నానీ భూతసంగీతం
లేదు దీనికి మొదలు ఉండబోదు అంతం
కాలం కాళగాత్రం నుండి ఈ వికృత ప్రేతగానం

కోటి ప్రతిధ్వనుల కోరస్ బృందంతో
ఈ విరిగిన వీణ నుండి వెలువడుతూనే వుంది
వినడం విధిలిఖితం నాకొకటే సందేహం
ఎవరా అదృశ్య వైణికుడు, ఎందుకని? ఎందుకని?

మళ్ళీ కలుద్దాం
Until next time, folks.

Saturday, June 2

నేతి, నేతి

ఇది కాదు జీవితం ఇంకా నిరీక్షణే
ఎదలోని తలపులు ఎదురు చూస్తున్నాయి

ఒక మల్లె విరియాలి ఒక జల్లు కురియాలి
నా అంతరవిపంచికను మరికొంత మరికొంత
మేళవించాలి శ్రుతి చక్క దిద్దాలి

ఇపుడిపుడె గొంతెత్తి ఇరుల సంగీతాన్ని
మనసింటి కాంతి శ్రుతి ఆలపించగరాదు
స్వరాలు ఒరుసుకుని గమకాలు మెరియవు
సందేహం నీడలో సంగతులు విరియవు

అసలు రాగమెన్నలేదు గతి వెట్టలేదు
నే పాడబోయే గీతి రచించనే లేదు
ఎదురు చూస్తున్నారని గళమెత్తలేను
నా శ్రోత నా ఆత్మ ఇంకా నిరీక్షణే

This poem was first posted on my English blog.


మళ్ళీ కలుద్దాం.
Till later, folks.

Sunday, May 27

ప్రకృతి ప్రస్తుతం

There are many influences a poet comes under: all poets you read shape your thinking, help you hone your method and voice; they entice you to mirror, however unconsciously, their style of saying things when you write what you think is an original. It happened to me too, but I am rather satisfied with this piece that Bairaagi inspired.


అనుభవం కల్లోలతరంగాలు
నెమ్మదించిన పిదప
హృదినీలతటాకమ్ములో
కత్తికోత ఎడబాటు నెత్తుటి చాలు

నెత్తుటి చాలును ప్రతిబింబిస్తూ
పూర్వాశావిశాలగగనమ్ములో
నిరీక్క్షణ లేతయెరుపు
విషాదం చేవ్రాలు

మళ్లీ కలుద్దాం.
Until next time, people.

Monday, May 21

హయికూ సందేహాలు

సంద్రతీరాన
అలల ముద్దులకి
వేచివున్నాను

అడుగు వేస్తే
కెరటం తాకవచ్చు
అయినా సరే

నిలబడ్డాను
సంశయిస్తున్నాను ఆ
కెరటం కోసం

అనుభవాలు
తమంత తాము రావా?
ఆహ్వానించాలా

కాలిపోయే ఈ
కర్పూరం గాలిలోనూ
కరిగిపోదా?

సంశయం నీడ
కన్నా క్రియ వేడిమి
ఉత్తమం కాదూ?

Later, folks.

Wednesday, May 16

రౌద్రిజాలు

చీకట్లో వొప్పుకొన్న నిజాలని
వెలుతురు ముంచివేసి మరుగు పరుస్తుంది
నిన్న రాత్రి నీ చేతిలోని వణుకుని
ఈ ఉదయం నువ్వు గుర్తుకి తెచ్చుకోవు

కాళరాత్రికి పెనుగాలి తోడు
ఎదలో నిరాశా నిస్పృహా జోడు
నిరాశా నిస్పృహా రైలు పట్టాలయినపుడు
జీవితం గమ్యం దుఃఖం కాక తప్పదు

నీడలా చీకటే కనుల కమ్మినపుడు
వెలుగు నీ చుట్టూ పరచుకోదు
చీకట్లో వెలిగించొక చిన్ని ప్రమిదెని
అని అనడం బహు సులభం

అసలీ చీకటి ఎలా ఎందుకు ఎప్పుడు
అని ప్రశ్నించుకో ఎప్పుడో ఒకప్పుడు
జవాబు కోసం వెదకే సడిలో
మరుగు పడుతుంది దుఃఖం

కారణం : పరిశోధన పరిశీలన తర్కం

తాత్పర్యం : బాధకొకటే మందు
మేధని మళ్ళించడం
(కాలి క్రింద గొయ్యి వున్నా
చూపు నింగికి సారించడం)

మళ్లీ కలుద్దాం.
Till the next time, folks.

Friday, May 11

లాలస రాగం

కోర్కె నల్లని నదీ ప్రవాహంలో
తృప్తి కిరణాలు మువ్వగోపాల పదాలు
రక్తనాళాలలో మ్రోగుతున్నదదేమి రాగం, మోహనం
అస్థికాండాల అంచుల్లో గుండె లయ యిపుడు ఆది తాళం
తీరని కామన రక్తనాళాలూదే తపన మురళి
జ్వలిస్తుందీ మేన అణువణువునా ఆహిరి
జాగృతయౌ కుండలిని యిపుడు కాలవ్యాళం
కణతల్లో గుండె లయకు మృదంగతాళం

Later, people.
మళ్లీ కలుద్దాం.

Friday, May 4

విచికిత్స

పెదవి పైన పెదవి ఆని

కడలి నింగి ఋణానుబంధం
నీలిమ లోతులు తరచి చూసి
నీలిమ అంచులు తాకి చూసి
ఎవరు దాత? ఎవరు గ్రహీత?

పెదవి పైన పెదవి ఆని

గాలి జ్వాల సహజీవనం
అస్తిత్వమంతా పరచుకుని
అగ్నిలోకి వీచి వీచి
ఎవరు చేత? ఎవరు ఊత?

పెదవి పైన పెదవి ఆని

కర్త క్రియల అవినాభావం
నరాల చివర్ల మోహం వణికి
వ్రేళ్లు తాకితే స్వర్గం తొణికి
ఎవరు స్పర్శ? ఎవరు పులకింత?

పెదవి పైన పెదవి ఆని

జీవన్మరణాల తర్కం
ఒక జ్ఞాపకం మొదలు ఒక కోరిక తుది
ఒక ప్రాణికి పునాది ఒక అధ్యాయం సమాధి
ఎవరు సృష్టి? ఎవరు స్రష్ట?


పెదవి పైన పెదవి ఆని
ఎవరు నీవు? ఎవరు నేను?

Tuesday, May 1

Vigil

This is a translation of జాగరణ రాత్రి, and it took some trial, tribulation and travail even, I tell you.

Dark is this night
Now
Thirst is the state

(seeking in the dark)
Song of night lives
Soul-rending

On edge of thought
In mind's sky
Shines a lone star

Crossing the Styx of life
With no coin for the ferryman
Dreamlike my childhood
Meadow of night

On paths my lost self
Wanders astray upon
Lie strewn tales of lost sorrows
Of everyone ever

Dark is this night
Now
Quest is the state

Rises a sliver of dawn moon
A doubt every moment
Seek to solve
Riddle inside riddle
Finding solution at end
In recesses of self

This night
In the sky of my eye
Flares a white flame
Sudden lightning
Bleaches the east

Last journey of renunciation
Into sanctum of self
Dawn enters heart
Stage right.


మళ్లీ కలుద్దాం
Later, people.

Saturday, April 28

గుబులుతున్న గీతి

లావాలా పొగులుతోంది మదిలో
లార్వాలా వేచివుంది పరిపక్వతకై
నిరంతరం నిజం నిజం
మూర్ఛనలూ మూలుగులు
కుములుతోంది రజం రజం
కనబడవిపుడే పొగలు సెగలు
యిపుడే కురియవు రవ్వలూ రాళ్లు

యుగయుగాల తపన
దినదినాలు అంతరాన
అగణిత మధనాల పెనగి
వేడి కమ్ముకుంటున్నది గానీ
గుండెపొరలిపుడే పగలవు
అయితే కన్నీరెపుడో ఆవిరి
అగ్నిపర్వతం ఆత్మాక్రోశం
వినబడదెపుడూ

మంటలెగిసి మిన్నుతాకి
పొగలు చిమ్ముతూ లావాదుఃఖంతో
పగలాలి అయినా
బూడిదప్రోవులలో మిగిలిన
పెనగి నలిగి సొలసిపోయిన
ఆఖరి మూలుగులే గానీ
పర్వతం బ్రద్దలైనపుడు
కేకలు వినబడవు

కన్నీటి యెరుపూ
మంటల పసుపూ
నిరాశ నలుపూ
చివరికి నుసి


మళ్లీ కలుద్దాం.
Later, people.

Friday, April 20

జాగరణ రాత్రి

I am not sure how I want this blog to evolve, but I do want to tell you about this poem, how it came about. This was one of those that spring up in mind all done in one go, no tweaking or fretting about if a word sounds right.

I wrote this on a night bus journey from Madras to Bangalore, and it was the first time I learnt the need to carry a pen and some paper to jot odd musings down before they mutate, get forgotten or lose the initial sharpness. I remember reciting it to myself in mutters, over and again until I could get hold of pen and paper.

There is another interesting thing about the poem, an observation made by Dr. C. Narayana Reddy, when he wrote a preface to my second book of collected poems. He called it a nirvachana kavita, which is a layered remark, to say the least.

'ఈ నిశీథిని కృష్ణ ' అంటూ ఒక నిర్వచన కవితను విసిరేసింది రౌద్రి. రాత్రికీ నీలిమకీ ' నలుపుకీ ' వున్న సౌరూప్యం కాలమంత పాతది. దాన్ని రెండు ముక్కల్లో కుదించి చెప్పడం అభివ్యక్తి పరిణతికి నిదర్శనం. ' ఇప్పుడు అస్థిత్వం ఒక తృష్ణ ' అనడం పొంగులా వెలువడిన భావానికి లోతును పొదగడం. అస్థిత్వం ' అస్థిత్వం అని సరిపెట్టుకోవాలి ', తృష్ణ అనడంలో పాత కొత్త తత్వ జిజ్ఞాసల మేలుకలయిక ఉంది.
ఇది నా ' నిద్రపోని పాట ' కి ముందుమాట వ్రాస్తూ ఆచార్య సినారె వెలిబుచ్చిన అభిప్రాయం. వచన కవితని నిర్వచన కవిత అని జోకేయడం వేరెవరికి చెల్లుతుందీ? స్థితికీ అస్థితికీ వేసిన లంకెని వారు చూసీచూడనట్లు వదిలేసినా, నేను ఈ బ్లాక్కోసం దాన్ని మార్చదలుచుకోలేదు. అస్తిత్వమంటే మాటలా మరి? ఇక చదవండి.

ఈ నిశీథిని కృష్ణ
ఇపుడు
అస్థిత్వమొక తృష్ణ
(చీకటిలో వెదుకులాట)

రాతిరిజీవాల పాట
ఆత్మవిదారకంగా
మనసువార
చిదంబరాన
వెలుగునొక యేకాకి తార

జీవితవైతరణి దాటగ
నాకెవరూ చేయని గోదానం
స్వప్నసదృశమౌ బాల్యపు
నిశాంతర మైదానం

దారి తప్పిన నానేను
తిరుగు బాటలలో కథలు
అందరూ అనాదిగా
పారేసుకొన్న వ్యధలు

ఈ నిశీథిని కృష్ణ
ఇపుడు
అస్థిత్వమొక ప్రశ్న

తెలవారుజాము నెలవంక
ప్రతిక్షణమింకో మరింకో శంక
ప్రశ్నలో ప్రశ్నకు జవాబు వెదకు
నీలో లోలోనే దొరకునది తుదకు

ఈ నిశీథి నా కంటి మింట
ఒక తెలిమంట యెగిసి
మేఘాలు లేకనే మెరసి
తూర్పు వెలిసి

ఆత్మాలయగర్భంలోకి
మహాభినిష్క్రమణం
హృదయంలో ఉదయం
రంగప్రవేశం

మళ్లీ కలుద్దాం
Later, people.

Monday, April 16

స్వపరిచయం

This was the first poem in the first published collection of my poetry. The title means self-introduction, but there is no way I can translate this poem- what with the musicological references, transferred and extended metaphors and allusions. Even so, the first poem in my first book ought to be the first poem in my poetry blog, so here we go.


రౌద్రి నామం జాతి దీప్తం
స్వర్లోకంలో ఏకాంతవాసం
గాంధారగ్రామం అంతరమార్గం
ఋతువు వర్షం నడక చౌకం

నా రీతి వేరు నా గీతి వేరు
ఉలిపికట్టె బాట విని ఎరుగని పాట

బుద్ధి చతురమే పలుకు మృదులం
మేధ తీక్ష్ణమే ధ్వని సూక్ష్మం
తలపు లలితమే రచన ఆర్తం
ఇప్పుడిప్పుడే విప్పాను గాత్రం

నా కవితానాదం యిన్నాళ్లూ అనాహతం
నా అంతరగాంధారం యిన్నేళ్లూ అస్వనితం
అనాసక్తత ప్రవృత్తి తటస్థత నా మతం
నేత్రం సాలోచనం దృక్కులంతర్ముఖం

ఆశ నా ఆధారషడ్జం సందేహం పక్క సారణి
కోర్కె నా మంద్రపంచమం బాధలనుమంద్రం
ప్రపంచంతో శృతి కలియదు అదే నా వేదన
స్థితప్రజ్ఙత కోసం నిరంతరం సాధన

Here is the transliterated version:

roudri naamam jaati deeptam
svarlOkamlO Ekaantavaasam
gaandhaaragraamam antaramaargam
Rtuvu varsham naDaka choukam

naa reeti vEru naa geeti vEru
ulipikaTTe baaTa vini erugani paaTa

buddhi chaturamE paluku mRdulam
mEdha teekshNamE dhvani sookshmam
talapu lalitamE rachana aartam
ippuDippuDE vippaanu gaatram

naa kavitaanaadam yinnaaLloo anaahatam
naa antaragaandhaaram yinnELloo asvanitam
anaasaktata pravRtti taTasthata naa matam
nEtram saalOchanam dRkkulantarmukham

aaSa naa aadhaarashaDjam sandEham pakka saaraNi
kOrke naa mandrapanchamam baadhalanumandram
prapanchamtO SRti kaliyadu adE naa vEdana
sthitaprajnata kOsam nirantaram saadhana



మళ్లీ కలుద్దాం.
Till later, people.

Sunday, April 15

telugu lessa

Hello.

This blog is where I will post my poetry, both Telugu and English, and occasional translations of either; I might post translations of poetry by others, too. I will post transliterations of the Telugu poems for the Telugu script challenged people.

This first post is just to check how the template looks. I will post a poem soon.

తెలుగెందుకంటే దేశభాషలందు తెలుగు లెస్స.
స్వగతం: ఇరవయ్యేళ్ల క్రితం, నా సంకలనం నిద్రపోని పాటకి ముందుమాట వ్రాస్తూ నేను కవిత్వానికి యీ రోజుల్లో చలామణీ అవుతున్న అనేక ఇజాల్లో నాది కేవలం రౌద్రిజం మాత్రమే అన్నాను.

స్వగతమే కాదు, స్వాగతం, కూడా.
 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.