Wednesday, August 15

విరక్తి రాగంలో విముక్తి గీతం

I know, it is a rehash. But it is frightening how things change and remain the same too. This poem was written in the eighties and still reads true.

కవి సమ్మేళనాల కోసం వ్రాసే కవితలు కొంచెం తేలిక గానే వుంటాయి; పైకి చదివేటపుడు, అదిన్నూ సభల్లో, కవిత మరీ హ్రస్వంగా వుండకూడదు, క్లిష్టంగానూ వుండకూడదు. At least, that is what I learnt in my few forays into poetry reading in public. చదువుకునే కవిత్వానికీ వినే కవితలకీ బోలెడంత దూరం గాబట్టి. ఆపాతమధురం ఆలోచనామృతం వేరు కాబట్టి. నేనూ Fifteenth August పజ్యాలు పుణ్యం కట్టుకున్నాను. ఇదిగో ఇలా:

గుండెలు చీల్చుకుని వస్తోందీ ఆక్రోశం
ఏమైపోతోంది నా దేశం?

త్యాగధనులూ ధర్మపురుషులు
అసంఖ్యాక కర్మయోగులు
ఆశాస్థికల చుట్టూ పోషించిన నా దేశం
నిస్స్వార్థత నిజాయితీ నిత్యం లోకకల్యాణం
ఆశయాల పునాదుల పై నిర్మించిన నా దేశం

అందరూ సుఖపడాలనీ
సంపదలు పంచుకోవాలనీ
సౌహార్ద్రత పెంచుకోవాలనీ
ప్రజానాయకులు చెర విడిపించిన పసిపాప
పుట్టినదాదిగా దిన దిన గండం
చుట్టూ శత్రువులూ యింట్లోనే కుట్రదారులూ
ఏ కొంచెం ప్రేమా భక్తీ త్యాగం సేవానిరతీ
కోటికొక్కరు చూపినా అదే పదివేలని మురిసిపోతూ
దిగులుచీకటిని చీల్చుకుని హర్షసూర్యోదయం
జరుగుతుందని భ్రమసిపోతూ
భయం భయంగా బెదురు బెదురుగా
నడివయస్కురాలయిపోయిన నా దేశం

ఏమైపోతోంది నా దేశం?
లేదా శాంతిభద్రతలకు ప్రవేశం?

ఉత్సాహం ఉరకలు వేసే కళ్ళలో
బంగారు కలలు నించుకొని
దేశం మీదే ప్రాణాలన్నీ వుంచుకొని
భావిలో ఎపుడో శాంతి పూలు విరుస్తాయనీ
స్నేహజలాలు హృదయక్షేత్రాలని
ఆనందనవనాలు చేస్తాయనీ
దేశంలో సామాన్యుని గుండెల్లో
స్వేచ్ఛావాయువులు వీస్తాయనీ
ఎదురుచూసి పాటుపడి
ప్రాణలు సైతం ఒగ్గిన
ఆ వీరుల నీడలనే మ్రింగేసిన చీకటి

నా దేశంలో సగటు మానవుడి సగం దేహం నగ్నం
నిండిన కడుపు అతనికి దివాస్వప్నం
కప్పు కురియని యిల్లూ అప్పు చేయని నెలా అతనికి గగనసుమాలు
కరువూ నల్ల బజారూ ధరలూ మోసాలూ
అతనికి సుపరిచితాలు
నిద్రలో కూడా అతనికి రిట్రెంచ్మెంట్ పీడకలలు
తృప్తీ విశ్రాంతీ అరనిముషం విరామం అసంభవం

నా దేశంలో సగటు మానవుడు బడుగు
ఎక్కడ వేశాం మనం తప్పటడుగు?
గుండెలు చీల్చుకొని వస్తోందీ ఆక్రోశం
లేదా సుఖశాంతులు గల ప్రదేశం?

నడుము కట్టి బాగుచేసి బాగుపడాల్సిన
యువత మేధావర్గం
గంజాయికలల కౌగిలిలో
కలవాళ్ళేమో కలర్ టివి సెట్లకోసం
మధ్య తరగతి మనుగడ త్రిశంకు స్వర్గం
దుండగులూ, దోపిడీదారులు
సుఖవ్యాధులూ దౌర్జన్యాలు
కట్నం చావులూ మతకలహాలు.

లేడా మన వెర్రిగొర్ర్రె జనతకి కాపరి?
ఏమైపోయాయి దీక్షా కార్యాచరణ?
ఏమైపోయాయి నిజాయితీ నిష్కపటం?
గుండెలు చీల్చుకొని వస్తోందీ ఆక్రోశం
ఏమైపోతోంది నా దేశం?

కానీ, చావుకి పెడితేనే లంఖణాలకి
వేకువ జాముకి మునుపే చీకటి చిక్కన

త్వరలోనే క్రాంతీ శాంతీ వెల్లి విరుస్తాయనీ
మనలోనే నూతనోత్తేజం పుట్టుకొస్తుందనీ
ఆశాభావంతో దీక్షాగీతం
పాడుతూనే వుంటుంది హృదయం

నిత్యకల్యాణంగా ఉద్భవించి తీరుతుందొక ఉదయం
దేశభక్తీ త్యాగనిరతి
నిజాయితీ కార్యదీక్ష
నిఘంటువుల్లోనే నిలిచిపోవు

స్వాతంత్ర్యం ఒక పారిజాతం
నా దెశం పవిత్ర దేవళం
సంపదలు సరిసమానం
సౌఖ్యం పుష్పక విమానం
ఆ రోజు వస్తుంది తప్పక
త్వరలోనే, త్వరలోనే

అపుడు ఆందోళన ఆర్తి మిగలవు లవలేశం
ప్రేమసీమ రామ రాజ్యం భూతల స్వర్గం నా దేశం.

Thus we welcome old age, folks.Thank you for bearing with me.

13 comments:

Sriram said...

నా దేశం, ఆక్రోశం...ప్రవేశం అంటూ మొత్తానికి మీరు కూడా అంత్యప్రాసతో పంద్రాగస్టు పద్యాలు రాసిన వాళ్ళే అన్నమాట.

బాగుందండీ మీ ఆశాభావం. మంచి కవిత్వం.

అన్నట్టు, అవలేశం అన్న పదం ఎప్పుడూ వినలేదు. నాకు బ్రౌన్లో కూడా కనపడలేదు. లవలేశం ఇదీ ఒకటేనా?

~ Sriram
sreekaaram.wordpress.com

Lalita said...

Sriram- The poem was written for an AIR Independence Day poetry reading session, though it was read by somebody else. And, yes, I am guilty of end rhyme poetry quite often.

As for the 'avalESam' it's a typo, I am afraid. I will correct it right away, thanks for pointing it out.

netizen నెటిజన్ said...

a disappointing wasted rhetoric..should have been left where it was..but a telling example what to expect from air

Anonymous said...

deenini kavitvam kante kapitvam ante baguntundi

బంగారు కలలు నించుకొని

kalalu ninchukovadam ento?

nava naaDulu krugipoyaayi mee kapitvam sagam chadivinappatike!!

Lalita said...

Netizen- This was ages ago, alright? Thanks for the feedback.

Anonynous- That should be 'kRngipOyaayi', so don't read me again, simple.

Lalita said...

Anonymous- Okay, I make typos. So what?

@ Netizen- Well, poetry had to read-out-able as well as redoubtable to pass AIR criteria. Ah, well. Considering I didn't ever recite it, to get flak is entertaining. It is history, kiddo.

Lalita said...

Sheesh, I dislike making typos, but since I do, I might as well acknowledge them.

@Netizen- read that as " poetry had to *be* read-out-able as well as redoubtable... et cetera.

Anonymous said...

నడవడం, పరిగెత్తడం, గంతులేయడం వచ్చిన తర్వాత - అప్పుడే నడకలు నేర్చుకునే శిశువును చూసి... ఏమి నడకది, ఆ పట్టుకుని నడవడమేమిటి, పడిపోవడమేమిటి...ఆ పాటి నడవలేవా - అన్నట్లున్నాయి, కవిత మీది వ్యాఖ్యలు.
లలిత గారు చెప్పారు కదా, ఇది తానెప్పుడో రాసినదని. ఎప్పుడో వ్రాసినవి బాగో కూడదని కాదు నా ఉద్దేశ్యం!
ఇక typos గురించి చదివినపుడు, మా ఆఫీసులో కొన్నేళ్ళ క్రితం మా బాస్ పంపిన email గుర్తొచ్చింది.
ఆ emailలో మొదటి వాక్యం:
Today I have night shit. Will come late tomorrow.
email దాదాపు యాభై మందికి వెళ్ళి ఉంటుంది. బాస్ స్పెల్ చెక్ ఉపయోగించి ఉంటాడు...అయినా కూడా :-)

రానారె said...
This comment has been removed by the author.
రానారె said...

"ఏ కొంచెం ప్రేమా భక్తీ త్యాగం సేవానిరతీ
కోటికొక్కరు చూపినా అదే పదివేలని మురిసిపోతూ ..." - కవితలోని ఈ భాగం నాకు చాలా నచ్చింది.

"ఉత్సాహం ఉరకలు వేసే కళ్ళలో
బంగారు కలలు నించుకొని ..." - నించుకొని అంటే నింపుకొని అని అర్థం ఉంది. పైన వ్యాఖ్యల్లో ఒక అనానిమాసురుడు "నించుకోవడం ఏంటో?" అన్నాడు/అన్నది/అన్నాడుది. "మనసున మనసై బ్రతుకున బ్రతుకై .." పాటలో "నిన్ను నిన్నుగా ప్రేమించు
టకూ, నీకోసమె కన్నీరు నించుటకు ... నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ" ఇలా "నించు" అనే మాట ఉపయోగించారు శ్రీశ్రీ. నించుకోవడమేమిటని ఆయన్నడిగి ఉంటే చెప్పాల్సిన పద్ధతిలో చెప్పేవాడే. తెనాలిరాముని పద్యం "తెలియనివన్ని తప్పులని ..." పద్యం మళ్ళీ గుర్తొచ్చేలా చేసిందా వ్యాఖ్య.

రానారె said...

ఈ కవిత చదివి నవనాడులూ కృంగినవారికోసం కాస్త ఉపశమనం కలిగించే చోటు ఇక్కడుంది. దయచేసి వెళ్లమని ప్రార్థన.

Lalita said...

siri garu- Thank you for taking time to comment.

raanaare garu- Thank you. Both for the comment, and carrying my 'kRngipODam' jab forward. Shri/shrimati Anon didn't get it, of course.

Unknown said...

the poem was very good and intreasting
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new channel

 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.