Saturday, June 23

మరువకూడని నిజాలు

Okay, I admit I have been neglecting this blog. And now I have the guilty conscience of not mentioning names when I wrote about reading Indian writers, and worse.

So, here is a poem. The idea is one thing, but the refrain is another. That was inspired by a song. Yeah, my father's lyric, so sue me. That song was sung by Balamuralikrishna, and Pendyala set a brilliant score. A search for the song shocked me. How can lyricists and poets who have a distinctive style be mistaken one for the other? It baffled me and bothered me. Kosaraju was a grand lyricist, but he never wrote this song. Arudra did.

Be that as it may, the words are what kill me softly, each time I hear the song.


మరువకూడని నిజాలు

చీకట్లో కన్నీళ్లు కనిపించవు
నిశ్శబ్దంలోనూ నీ వెక్కిళ్లు వినిపించవు
చూసే కళ్లు లేకపోతే
వినే చెవులు లేవు గనక

రాత్రంతా నీ కళ్లు వరద గోదారులయినా
పట్టించుకునే హృదయం లేదు
నీ ఏకాంతం నీ పరదేశీతనం
నిన్ను విడిచి పోవు.

వెలుతురు వరదలో చీకటి తరగవి
ప్రపంచగీతంలో పలకని పంచమివి
గిల్లివేసిన మల్లెపూ తొడిమెవి
అనాకర్షణీయమైన దానివి
ఆరో వేలులాంటి దానివి
అక్కర్లేని దానివి

నీ ఏకాంతం నీ పరదేశీతనం
ఎన్నటికీ ఎప్పటికీ
నిన్ను విడిచి పోవు.

మళ్ళీ కలుద్దాం,
Till later, people.

Wednesday, June 13

జాగారం

నక్షత్రాలని ప్రవేశపెట్టే
నల్లదనం యింకా అలుముకోని వేళ
మారుమూల పల్లెల్లో గోధూళి వేళ
మహాపట్టణాలలో వాతావరణ కాలుష్యం వేళ
గాలికి వాలే రెల్లుగడ్డి వేళ

బాధలో
వేచి వుండు
లేచివుండు

చంద్రవంక ఒక చన్ను మాత్రం
రేఖామాత్రంగా కనబడే అమ్మాయి
అశరీరి
అనామిక
కనబడని రహస్య తారక
ఆమె నాభి

వేచి వుండు
లేచి వుండు
ఆమె జీవితకాలసూత్రం జారుతుంది

వేకువ చుక్క వెలిగే ముందు
వెలిసే చీకటి వేళ
ఎక్కడో పిట్టల వేళ
ఇక్కడ కాకుల వేళ

ఎంత క్షణికం!
వేదనావాహిని
ఎంత నిరంతరం!
వేచి వున్నావు కదూ?


ఉమాశంకర్ కి అనువాదం

మళ్లీ కలుద్దాం.
Later, people.

Friday, June 8

శృతి తప్పిన గీతిక

Hello again people.

I've rather neglected my poetry blog, I know. I am fobbing you off with another recycled poem again. But I am working on a few haiku and tanka offerings, I promise. (as if I have hordes of readers panting for any, but still.)

This is an old poem, published way back in '87, but it was appreciated by senior poets. You know you have made an impression when people who bother about poetry dissect a poem on offer and write about nuances.

ఈ విరిగిన వీణని మీటుతున్నారెవరో
ఎంత వికృతంగా వుందీ ధ్వని?

భూమ్మీదిపుడే పడిన పసికందు రోదనవలె
ప్రమాదంలో చావనోచుకోని దౌర్భాగ్యుని మూల్గులవలె
ఎటనుంచో తేలివచ్చు ఎన్నికల వాగ్దానాల వలె
పరిచిత స్వరాలపరిచిత స్వనములలో నేర్చుకోని పాట లాగు
మరిచిపోని ములుకు లాటి హితుల చేదు మాట లాగు

ఈ విరిగిన వీణ నుండి రాబట్టే ధ్వని
ఎంత వికృతంగా వుంది!

ఊళ్ళని ముంచేసిన ఉప్పెన హోరులాగు
జనతాకాశంలో ఏకాకి గాలిపడగలాగు
నిదురెరుగని నిర్విరామ నీరధి ఘోషం వలె
రాత్రి వీధుల్లో వెర్రిమెదడు విహారంవలె

ఎన్ని విషాద పదార్థాల కలయిక
ఎంత వికృతంగా వుందీ ధ్వని!

ఓపలేని ఆపరాని అనంత విలయగీతం
ఈ విరిగిన వీణనుండి ఎందుకిలా వెలువడుతోంది?
చేతులు తాకని తీవెలు తమంతతామె మ్రోగి
వేళ్ళు నొక్కిపెట్టని మెట్ల ప్రళయ రాగాలు సాగి

విలపించే గుండెపంచ ప్రతి స్వరం చిత్రహింస
ఎంత కాలం నుండి వింటున్నానీ భూతసంగీతం
లేదు దీనికి మొదలు ఉండబోదు అంతం
కాలం కాళగాత్రం నుండి ఈ వికృత ప్రేతగానం

కోటి ప్రతిధ్వనుల కోరస్ బృందంతో
ఈ విరిగిన వీణ నుండి వెలువడుతూనే వుంది
వినడం విధిలిఖితం నాకొకటే సందేహం
ఎవరా అదృశ్య వైణికుడు, ఎందుకని? ఎందుకని?

మళ్ళీ కలుద్దాం
Until next time, folks.

Saturday, June 2

నేతి, నేతి

ఇది కాదు జీవితం ఇంకా నిరీక్షణే
ఎదలోని తలపులు ఎదురు చూస్తున్నాయి

ఒక మల్లె విరియాలి ఒక జల్లు కురియాలి
నా అంతరవిపంచికను మరికొంత మరికొంత
మేళవించాలి శ్రుతి చక్క దిద్దాలి

ఇపుడిపుడె గొంతెత్తి ఇరుల సంగీతాన్ని
మనసింటి కాంతి శ్రుతి ఆలపించగరాదు
స్వరాలు ఒరుసుకుని గమకాలు మెరియవు
సందేహం నీడలో సంగతులు విరియవు

అసలు రాగమెన్నలేదు గతి వెట్టలేదు
నే పాడబోయే గీతి రచించనే లేదు
ఎదురు చూస్తున్నారని గళమెత్తలేను
నా శ్రోత నా ఆత్మ ఇంకా నిరీక్షణే

This poem was first posted on my English blog.


మళ్ళీ కలుద్దాం.
Till later, folks.
 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.