Wednesday, June 13

జాగారం

నక్షత్రాలని ప్రవేశపెట్టే
నల్లదనం యింకా అలుముకోని వేళ
మారుమూల పల్లెల్లో గోధూళి వేళ
మహాపట్టణాలలో వాతావరణ కాలుష్యం వేళ
గాలికి వాలే రెల్లుగడ్డి వేళ

బాధలో
వేచి వుండు
లేచివుండు

చంద్రవంక ఒక చన్ను మాత్రం
రేఖామాత్రంగా కనబడే అమ్మాయి
అశరీరి
అనామిక
కనబడని రహస్య తారక
ఆమె నాభి

వేచి వుండు
లేచి వుండు
ఆమె జీవితకాలసూత్రం జారుతుంది

వేకువ చుక్క వెలిగే ముందు
వెలిసే చీకటి వేళ
ఎక్కడో పిట్టల వేళ
ఇక్కడ కాకుల వేళ

ఎంత క్షణికం!
వేదనావాహిని
ఎంత నిరంతరం!
వేచి వున్నావు కదూ?


ఉమాశంకర్ కి అనువాదం

మళ్లీ కలుద్దాం.
Later, people.

1 comment:

Anonymous said...

What a brilliant poem, Lali. Publish the original, too. Please.

 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.