Saturday, April 28

గుబులుతున్న గీతి

లావాలా పొగులుతోంది మదిలో
లార్వాలా వేచివుంది పరిపక్వతకై
నిరంతరం నిజం నిజం
మూర్ఛనలూ మూలుగులు
కుములుతోంది రజం రజం
కనబడవిపుడే పొగలు సెగలు
యిపుడే కురియవు రవ్వలూ రాళ్లు

యుగయుగాల తపన
దినదినాలు అంతరాన
అగణిత మధనాల పెనగి
వేడి కమ్ముకుంటున్నది గానీ
గుండెపొరలిపుడే పగలవు
అయితే కన్నీరెపుడో ఆవిరి
అగ్నిపర్వతం ఆత్మాక్రోశం
వినబడదెపుడూ

మంటలెగిసి మిన్నుతాకి
పొగలు చిమ్ముతూ లావాదుఃఖంతో
పగలాలి అయినా
బూడిదప్రోవులలో మిగిలిన
పెనగి నలిగి సొలసిపోయిన
ఆఖరి మూలుగులే గానీ
పర్వతం బ్రద్దలైనపుడు
కేకలు వినబడవు

కన్నీటి యెరుపూ
మంటల పసుపూ
నిరాశ నలుపూ
చివరికి నుసి


మళ్లీ కలుద్దాం.
Later, people.

Friday, April 20

జాగరణ రాత్రి

I am not sure how I want this blog to evolve, but I do want to tell you about this poem, how it came about. This was one of those that spring up in mind all done in one go, no tweaking or fretting about if a word sounds right.

I wrote this on a night bus journey from Madras to Bangalore, and it was the first time I learnt the need to carry a pen and some paper to jot odd musings down before they mutate, get forgotten or lose the initial sharpness. I remember reciting it to myself in mutters, over and again until I could get hold of pen and paper.

There is another interesting thing about the poem, an observation made by Dr. C. Narayana Reddy, when he wrote a preface to my second book of collected poems. He called it a nirvachana kavita, which is a layered remark, to say the least.

'ఈ నిశీథిని కృష్ణ ' అంటూ ఒక నిర్వచన కవితను విసిరేసింది రౌద్రి. రాత్రికీ నీలిమకీ ' నలుపుకీ ' వున్న సౌరూప్యం కాలమంత పాతది. దాన్ని రెండు ముక్కల్లో కుదించి చెప్పడం అభివ్యక్తి పరిణతికి నిదర్శనం. ' ఇప్పుడు అస్థిత్వం ఒక తృష్ణ ' అనడం పొంగులా వెలువడిన భావానికి లోతును పొదగడం. అస్థిత్వం ' అస్థిత్వం అని సరిపెట్టుకోవాలి ', తృష్ణ అనడంలో పాత కొత్త తత్వ జిజ్ఞాసల మేలుకలయిక ఉంది.
ఇది నా ' నిద్రపోని పాట ' కి ముందుమాట వ్రాస్తూ ఆచార్య సినారె వెలిబుచ్చిన అభిప్రాయం. వచన కవితని నిర్వచన కవిత అని జోకేయడం వేరెవరికి చెల్లుతుందీ? స్థితికీ అస్థితికీ వేసిన లంకెని వారు చూసీచూడనట్లు వదిలేసినా, నేను ఈ బ్లాక్కోసం దాన్ని మార్చదలుచుకోలేదు. అస్తిత్వమంటే మాటలా మరి? ఇక చదవండి.

ఈ నిశీథిని కృష్ణ
ఇపుడు
అస్థిత్వమొక తృష్ణ
(చీకటిలో వెదుకులాట)

రాతిరిజీవాల పాట
ఆత్మవిదారకంగా
మనసువార
చిదంబరాన
వెలుగునొక యేకాకి తార

జీవితవైతరణి దాటగ
నాకెవరూ చేయని గోదానం
స్వప్నసదృశమౌ బాల్యపు
నిశాంతర మైదానం

దారి తప్పిన నానేను
తిరుగు బాటలలో కథలు
అందరూ అనాదిగా
పారేసుకొన్న వ్యధలు

ఈ నిశీథిని కృష్ణ
ఇపుడు
అస్థిత్వమొక ప్రశ్న

తెలవారుజాము నెలవంక
ప్రతిక్షణమింకో మరింకో శంక
ప్రశ్నలో ప్రశ్నకు జవాబు వెదకు
నీలో లోలోనే దొరకునది తుదకు

ఈ నిశీథి నా కంటి మింట
ఒక తెలిమంట యెగిసి
మేఘాలు లేకనే మెరసి
తూర్పు వెలిసి

ఆత్మాలయగర్భంలోకి
మహాభినిష్క్రమణం
హృదయంలో ఉదయం
రంగప్రవేశం

మళ్లీ కలుద్దాం
Later, people.

Monday, April 16

స్వపరిచయం

This was the first poem in the first published collection of my poetry. The title means self-introduction, but there is no way I can translate this poem- what with the musicological references, transferred and extended metaphors and allusions. Even so, the first poem in my first book ought to be the first poem in my poetry blog, so here we go.


రౌద్రి నామం జాతి దీప్తం
స్వర్లోకంలో ఏకాంతవాసం
గాంధారగ్రామం అంతరమార్గం
ఋతువు వర్షం నడక చౌకం

నా రీతి వేరు నా గీతి వేరు
ఉలిపికట్టె బాట విని ఎరుగని పాట

బుద్ధి చతురమే పలుకు మృదులం
మేధ తీక్ష్ణమే ధ్వని సూక్ష్మం
తలపు లలితమే రచన ఆర్తం
ఇప్పుడిప్పుడే విప్పాను గాత్రం

నా కవితానాదం యిన్నాళ్లూ అనాహతం
నా అంతరగాంధారం యిన్నేళ్లూ అస్వనితం
అనాసక్తత ప్రవృత్తి తటస్థత నా మతం
నేత్రం సాలోచనం దృక్కులంతర్ముఖం

ఆశ నా ఆధారషడ్జం సందేహం పక్క సారణి
కోర్కె నా మంద్రపంచమం బాధలనుమంద్రం
ప్రపంచంతో శృతి కలియదు అదే నా వేదన
స్థితప్రజ్ఙత కోసం నిరంతరం సాధన

Here is the transliterated version:

roudri naamam jaati deeptam
svarlOkamlO Ekaantavaasam
gaandhaaragraamam antaramaargam
Rtuvu varsham naDaka choukam

naa reeti vEru naa geeti vEru
ulipikaTTe baaTa vini erugani paaTa

buddhi chaturamE paluku mRdulam
mEdha teekshNamE dhvani sookshmam
talapu lalitamE rachana aartam
ippuDippuDE vippaanu gaatram

naa kavitaanaadam yinnaaLloo anaahatam
naa antaragaandhaaram yinnELloo asvanitam
anaasaktata pravRtti taTasthata naa matam
nEtram saalOchanam dRkkulantarmukham

aaSa naa aadhaarashaDjam sandEham pakka saaraNi
kOrke naa mandrapanchamam baadhalanumandram
prapanchamtO SRti kaliyadu adE naa vEdana
sthitaprajnata kOsam nirantaram saadhana



మళ్లీ కలుద్దాం.
Till later, people.

Sunday, April 15

telugu lessa

Hello.

This blog is where I will post my poetry, both Telugu and English, and occasional translations of either; I might post translations of poetry by others, too. I will post transliterations of the Telugu poems for the Telugu script challenged people.

This first post is just to check how the template looks. I will post a poem soon.

తెలుగెందుకంటే దేశభాషలందు తెలుగు లెస్స.
స్వగతం: ఇరవయ్యేళ్ల క్రితం, నా సంకలనం నిద్రపోని పాటకి ముందుమాట వ్రాస్తూ నేను కవిత్వానికి యీ రోజుల్లో చలామణీ అవుతున్న అనేక ఇజాల్లో నాది కేవలం రౌద్రిజం మాత్రమే అన్నాను.

స్వగతమే కాదు, స్వాగతం, కూడా.
 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.