Friday, June 8

శృతి తప్పిన గీతిక

Hello again people.

I've rather neglected my poetry blog, I know. I am fobbing you off with another recycled poem again. But I am working on a few haiku and tanka offerings, I promise. (as if I have hordes of readers panting for any, but still.)

This is an old poem, published way back in '87, but it was appreciated by senior poets. You know you have made an impression when people who bother about poetry dissect a poem on offer and write about nuances.

ఈ విరిగిన వీణని మీటుతున్నారెవరో
ఎంత వికృతంగా వుందీ ధ్వని?

భూమ్మీదిపుడే పడిన పసికందు రోదనవలె
ప్రమాదంలో చావనోచుకోని దౌర్భాగ్యుని మూల్గులవలె
ఎటనుంచో తేలివచ్చు ఎన్నికల వాగ్దానాల వలె
పరిచిత స్వరాలపరిచిత స్వనములలో నేర్చుకోని పాట లాగు
మరిచిపోని ములుకు లాటి హితుల చేదు మాట లాగు

ఈ విరిగిన వీణ నుండి రాబట్టే ధ్వని
ఎంత వికృతంగా వుంది!

ఊళ్ళని ముంచేసిన ఉప్పెన హోరులాగు
జనతాకాశంలో ఏకాకి గాలిపడగలాగు
నిదురెరుగని నిర్విరామ నీరధి ఘోషం వలె
రాత్రి వీధుల్లో వెర్రిమెదడు విహారంవలె

ఎన్ని విషాద పదార్థాల కలయిక
ఎంత వికృతంగా వుందీ ధ్వని!

ఓపలేని ఆపరాని అనంత విలయగీతం
ఈ విరిగిన వీణనుండి ఎందుకిలా వెలువడుతోంది?
చేతులు తాకని తీవెలు తమంతతామె మ్రోగి
వేళ్ళు నొక్కిపెట్టని మెట్ల ప్రళయ రాగాలు సాగి

విలపించే గుండెపంచ ప్రతి స్వరం చిత్రహింస
ఎంత కాలం నుండి వింటున్నానీ భూతసంగీతం
లేదు దీనికి మొదలు ఉండబోదు అంతం
కాలం కాళగాత్రం నుండి ఈ వికృత ప్రేతగానం

కోటి ప్రతిధ్వనుల కోరస్ బృందంతో
ఈ విరిగిన వీణ నుండి వెలువడుతూనే వుంది
వినడం విధిలిఖితం నాకొకటే సందేహం
ఎవరా అదృశ్య వైణికుడు, ఎందుకని? ఎందుకని?

మళ్ళీ కలుద్దాం
Until next time, folks.

1 comment:

Anonymous said...

What an unsettling poem, Lali. Very disturbing. Brilliant as usual, but the poem hurts.

 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.