Wednesday, May 16

రౌద్రిజాలు

చీకట్లో వొప్పుకొన్న నిజాలని
వెలుతురు ముంచివేసి మరుగు పరుస్తుంది
నిన్న రాత్రి నీ చేతిలోని వణుకుని
ఈ ఉదయం నువ్వు గుర్తుకి తెచ్చుకోవు

కాళరాత్రికి పెనుగాలి తోడు
ఎదలో నిరాశా నిస్పృహా జోడు
నిరాశా నిస్పృహా రైలు పట్టాలయినపుడు
జీవితం గమ్యం దుఃఖం కాక తప్పదు

నీడలా చీకటే కనుల కమ్మినపుడు
వెలుగు నీ చుట్టూ పరచుకోదు
చీకట్లో వెలిగించొక చిన్ని ప్రమిదెని
అని అనడం బహు సులభం

అసలీ చీకటి ఎలా ఎందుకు ఎప్పుడు
అని ప్రశ్నించుకో ఎప్పుడో ఒకప్పుడు
జవాబు కోసం వెదకే సడిలో
మరుగు పడుతుంది దుఃఖం

కారణం : పరిశోధన పరిశీలన తర్కం

తాత్పర్యం : బాధకొకటే మందు
మేధని మళ్ళించడం
(కాలి క్రింద గొయ్యి వున్నా
చూపు నింగికి సారించడం)

మళ్లీ కలుద్దాం.
Till the next time, folks.

1 comment:

Anonymous said...

కదళీపాకంలోనూ అందెవేసిన చేయేనన్నమాట. This is good, are we going to get treated to more of Roudrisms?

 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.