Sunday, July 29

Of definitions

అస్తిత్వం కోల్పోయి అనిర్వచనీయమైన
అందీ అందని అంచున వేలాడేటపుడు
నీవెక్కడో తెలుసా, నీవెవరో తెలుసా?

బుసకొట్టే నిట్టూర్పుల్లో గుసగుసలాడే ఆజ్ఞల్లో
మెట్లెక్కే దైహికానుభూతి పర్వతారోహణ అందామా?
ప్రాణి ప్రాణిని పూజించే తరుణాన్ని విపులీకరించమంటావు, ఎలా?

పలుకు మూగవోయి ఎడద నిండిపోయి
చెమట తొలకరి పంటకొచ్చే క్షేత్రం గాత్రమైనపుడు
వేదపాఠాల గాంభీర్యం స్వేదవర్షాల సన్నివేశాల కబ్బినపుడు
మెలివడిన వ్రేళ్లకి హోమాగ్నికీలలు పరమయినపుడు
అష్టోత్తరశతంగా దేహార్చనలో ముద్దులు నిండినపుడు
కోవెల గంటల ప్రతిధ్వని గుండె సవ్వడి కాదేశమైనపుడు

ఇది పూజ కాదా?
పరమార్ధమేమిటి?
ఒక చిరుమరణం

4 comments:

Anonymous said...

What a brilliant poem Lali. You carried it off in two languages. Please write about how the two versions evolved, do. A very moving poem and that is litotes.

Anonymous said...

Interesting. Liked it very much.

Lalita said...

Ash- Thanks, but writing about the evolution of the two poems wouldn't be all that interesting, I think.

Anon- Thank you. Please find a name to comment with, hmm?

Anonymous said...

చాలా బాగుందండీ. చిన్ని మాటలతో ఎంతెంతో చెప్పారు.

 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.