పెదవి పైన పెదవి ఆని
కడలి నింగి ఋణానుబంధం
నీలిమ లోతులు తరచి చూసి
నీలిమ అంచులు తాకి చూసి
ఎవరు దాత? ఎవరు గ్రహీత?
పెదవి పైన పెదవి ఆని
గాలి జ్వాల సహజీవనం
అస్తిత్వమంతా పరచుకుని
అగ్నిలోకి వీచి వీచి
ఎవరు చేత? ఎవరు ఊత?
పెదవి పైన పెదవి ఆని
కర్త క్రియల అవినాభావం
నరాల చివర్ల మోహం వణికి
వ్రేళ్లు తాకితే స్వర్గం తొణికి
ఎవరు స్పర్శ? ఎవరు పులకింత?
పెదవి పైన పెదవి ఆని
జీవన్మరణాల తర్కం
ఒక జ్ఞాపకం మొదలు ఒక కోరిక తుది
ఒక ప్రాణికి పునాది ఒక అధ్యాయం సమాధి
ఎవరు సృష్టి? ఎవరు స్రష్ట?
పెదవి పైన పెదవి ఆని
ఎవరు నీవు? ఎవరు నేను?
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
చాలా బావున్నాయండి మీ కవితలు. అందుకోండి అభినందనలు
ఏదో పాతకాలం రాతలండీ. నచ్చాయంటే సంతోషమే.
This is a densely packed poem, I must say. Lovely, Lali. అనుభూతి సాంద్రతకీ భావనా సాంద్రతకీ పెట్టిన లంకె బాగుంది. The immediacy is piercingly clear.
'''సృష్ట''' అన్న పదం తెలుగులో ఉందా? లేదా ప్రాసకోసం సృష్టికర్త ను సృష్ట చేశారా?
నవీన్ గారూ, నమస్తే. శబ్దరత్నాకరంలోనూ బ్రౌణ్యంలోనూ సృష్ట అన్న వాడకం వుంది. సమాసాల్లో స్వతంత్రిచ్చ వచ్చుగానీ నిఘంటువుల్లో లేని పదాలు వాడ్డం నాకు ఎబ్బెట్టుగా తోస్తుంది.
Ash, thanks.
లలితగారూ, నమస్తే. శబ్దరత్నాకరం నా దగ్గర లేదు కానీ సృష్ట అన్నపదం నాకు బ్రౌణ్యం ఆన్లైన్ లో కనిపించలేదండీ.
(http://dsal.uchicago.edu/dictionaries/brown/)
మీరు కొంచెం చూపగలరా? స్రష్ట అన్నదానికీ దీనికీ ఏమైనా తేడా ఉందా?
ఇంకొక సందేహం, నీలిమ అన్నపదం మీరు నలుపు అనే అర్ధంలోనే వాడారా?
శ్రీరాం గారూ తప్పు నాదేనండీ. టైపు చెయ్యడంలో పప్పులోకాలేసాను. తెలిసిన మాటల్ని చదవడంలో కన్నుకన్నా బుర్ర త్వరగా పనిచేసి అచ్చుతప్పుల్ని సరిగా చదివేస్తుంది, దాంతో మళ్ళీ చూసుకోలేదు. నా బ్రౌణ్యం నిజం పుస్తకం, ఆన్లైన్ వుందని నాకీ మధ్యనే తెలిసింది. I will change it. Thank you.
నీలిమని నలుపు అనే వాడాను, deep sea and deep space are equally dark, after all.
అద్భుతమండి.మొదటి నుండి చివరివరకూ ఒకే పట్టులో రాసారు.చాలా చాలా బాగుంది.
"గాలి జ్వాల సహజీవనం"
ప్రాణానల సంయోగము వలన ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నారు త్యాగరాజ స్వామి.
మీ పద్యం భాగుంది.
LalitagaarU...Thanks for the explanation...!
Radhika garu, thank you.
కొత్త పాళీ గారూ, thank you. I am honoured.
Sriram garu, it is I that ought to thank you for pointing it out to me.
చాలా బాగుందీకవిత. అద్వైత సిద్ది కలిగింది.
పరిచయం చేసిన కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.
--ప్రసాద్
http://blog.charasala.com
కవితలు అర్థం కాకున్నా చదివి తలగోక్కునే నన్ను, ఈ కవిత ఆలోచింపజేసింది, అంటే నాకేదో అర్థమయ్యీకానట్టుంది. భలే!
Prasad garu, thank you.
Raanaare garu, I achieved my purpose then. Thank you.
The paomnnehal pweor of the hmuan mnid
aocdring to a rscheearch at acmabridge Uinervstisy, it deosn't mttaer in waht oredr the ltteers in a wrod are, the olny imrpoatnt tihng is taht the frist and lsat ltteer be in the rghit pclae. The rset can be a taotal mses and you can sitll raed it wouthit porbelm. Tihs is bcuseae the huamn mnid deos not raed ervey lteter by istlef, but the wrod as awlohe.
Amazinighuh?
Anon- Sigh.
mee vichikitsa nijamga adbhutam ga vunandi. Telugu lo inta bhavukata eerojulalo raadane anukunnanu mee ee kavitha chadivindaka. chaala thanks meeku.
Vishwapriya- Thank you. You have no idea how gratifying it is to find a new comment on an old post. I am glad you liked the poem.
I love both your blogs! I live away from Andhra and sometimes have this unbelievable craving for nostalgia (if that makes sense) and your blog is heaven!
Post a Comment