సంద్రతీరాన
అలల ముద్దులకి
వేచివున్నాను
అడుగు వేస్తే
కెరటం తాకవచ్చు
అయినా సరే
నిలబడ్డాను
సంశయిస్తున్నాను ఆ
కెరటం కోసం
అనుభవాలు
తమంత తాము రావా?
ఆహ్వానించాలా
కాలిపోయే ఈ
కర్పూరం గాలిలోనూ
కరిగిపోదా?
సంశయం నీడ
కన్నా క్రియ వేడిమి
ఉత్తమం కాదూ?
Later, folks.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
"అనుభవాలు
తమంత తాము రావా?
ఆహ్వానించాలా"
ఇది చదవగానే చాలా రోజుల తరువాత ఆలోచనలు వస్తున్నాయి.అద్భుతం గా రాసారండి.
అనుభవాలు తమంత తాము రావా, ఆహ్వానించాలా? ఇదీ ప్రశ్న. Lovely haikus. You could have elaborated further, but still, a nice post.
Post a Comment